Sama Ram Mohan Reddy: బీజేపీ, బీఆర్ఎస్ పొత్తుకు తొలి అడుగు

Sama Ram Mohan Reddy: బీజేపీ, బీఆర్ఎస్ పొత్తుకు తొలి అడుగు

హైదరాబాద్, జూన్ 30: బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన వేళ.. టీపీసీసీ మీడియా చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తుకు తొలి అడుగు పడిందన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు బీజేపీ మద్దతు ఇస్తుందని.. అలాగే కేంద్రంలో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని తెలిపారు. ఇదే రెండు పార్టీల సారాంశమని ఆయన పేర్కొన్నారు. అందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచందర్ రావు నియామకం జరగనుందని ఆయన వివరించారు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయంటూ ఆయన జోస్యం చెప్పారు. బీజేపీ ఈక్వల్ టూ బీఆర్ఎస్ పార్టీ అని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు సామా రామ్మోహన్ రెడ్డి.. తన ఎక్స్ ఖాతా వేదికగా సోమవారం వెల్లడించారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న వేళ టీపీసీసీ అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయంటూ ఆరోపించారు. అందులోభాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచందర్ రావు ఎన్నికవుతున్నారని తెలిపారు. | Source: Andhrajyothy Telugu News

Ralated News

0. Telangana MLA T Raja Singh Quits BJP, Flags State Party Chief Choice - NDTV
1. Telangana BJP MLA T Raja Singh resigns from party amid ‘leadership tussle’ - Hindustan Times
2. Cracks in Telangana BJP as Raja Singh quits over Ramchander Rao elevation to party chief - The Indian Express
3. 'Shocked and disappointed': T Raja Singh resigns from BJP; cites reports of Ramchander Rao's likely appoi - Times of India
4. MLA T Raja Singh quits BJP over reported choice for Telangana party unit chief - India Today
5. Telangana BJP MLA Raja Singh announces resignation from party - The Hindu
6. Raja Singh resigns from BJP over Ramchander Rao's likely appointment as Telangana state chief - India TV News
7. Raja Singh Resigns: Telangana BJP MLA Steps Down Over Party Leadership Issue - Deccan Herald
8. Tiger Raja Singh resigns from Bharatiya Janta Party after he wasn't appointed State President - OpIndia
9. BJP MLA T Raja Singh Quits Party; Submits Resignation To Kishan Reddy - Deccan Chronicle
Previous Post Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *