AP EAPCET 2025: ఇంటర్‌ మార్కులు సరిచూసుకోవాలి

AP EAPCET 2025: ఇంటర్‌ మార్కులు సరిచూసుకోవాలి

ఏపీఈఏపీసెట్‌ చైర్మన్‌ సీఎస్ఆర్కే ప్రసాద్‌

జేఎన్టీయూకే, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): ఏపీఈఏపీసెట్‌ ఫలితాలను ఈ నెల రెండో వారంలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ర్యాంకుల కేటాయింపులో ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉన్నందున పరీక్షకు హాజరైన విద్యార్థులు ఈఏపీసెట్‌ వెబ్‌సైట్‌లోని డిక్లరేషన్‌ ఫారం ద్వారా తమ మార్కులను పరిశీలించుకోవాలని సెట్‌ చైర్మన్‌, ఉపకులపతి ప్రొఫెసర్‌ సీఎస్ఆర్కే ప్రసాద్‌ తెలిపారు. ఏపీ, తెలంగాణల్లోని ఇంటర్‌ రెగ్యులర్‌ విద్యార్థుల గ్రూపు మార్కులను వెబ్‌సైట్‌లో పొందుపరిచామని ఆయన చెప్పారు. డిక్లరేషన్‌ ఫారంలో అందుబాటులో ఉన్న ఇంటర్‌ రెగ్యులర్‌, ఇతర బోర్డుల విద్యార్థులకు సంబంధించిన గ్రూపు మార్కుల్లో ఎటువంటి తప్పిదాలు ఉన్నా వెంటనే 0884-2359599, 2342499 ఫోన్‌ నెంబర్ల ద్వారా గానీ, helpdeskapeapcet@apsche.org మెయిల్‌ ఐడీ ద్వారా గానీ సంప్రదించి మార్కులను మెయిల్‌ ద్వారా అందజేయాలని ఈఏపీసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ వీవీ సుబ్బారావు సూచించారు. 10+2 మార్కులను గ్రూపు మార్కులను డిక్లరేషన్‌ ఫారం ద్వారా అప్‌లోడ్‌ చేయని వారు, గ్రూప్‌ మార్కుల్లో తప్పిదాలు ఉన్న విద్యార్థులకు ఈ నెల 5వ తేదీలోపు సవరించుకునేందుకు అవకాశం కల్పించినట్టు కన్వీనర్‌ తెలిపారు.

ఏపీఈఏపీసెట్‌ ఫలితాల విడుదలకు సిద్ధంగా ఉంటుండగా, ఇంటర్‌ మార్కులపై 25 శాతం వెయిటేజ్ ఉన్నందున విద్యార్థులు తమ మార్కులను వెబ్‌సైట్‌లోని డిక్లరేషన్‌ ఫారం ద్వారా పరిశీలించుకోవాలి. ఎటువంటి తప్పిదాలు ఉంటే, జూన్‌ 5వ తేదీకి ముందుగా సవరించుకునేందుకు అవకాశముంది. | Source: Andhrajyothy Telugu News

Ralated News

0. AP SSC 2025 Result (Announced): Manabadi, Sakshi, Eenadu - Getmyuni
1. AP 10th SSC Result 2025 OUT Highlights: BSEAP SSC Regular, Open Results Announced, Steps to Download Manabadi Eenadu Marks Memo PDF - Times Now
2. TS Inter Result 2025 OUT @tsbie.cgg.gov.in Today at 12PM; Ways to check TSBIE 1st, 2nd Year Results - Shiksha
3. AP Inter Result 2025 date and time out, to be declared on April 12 at 11 am - India Today
4. TS Inter Result 2025 (Released) Live Update: Manabadi, Sakshi, Eenadu - Getmyuni
5. TS EAMCET 2025 Results (Out) Live: TG EAPCET result link at eapcet.tgche.ac.in; cut-off, toppers - Careers360
6. AP Inter 2025 Result Download Link (Activated): Manabadi, Sakshi, Eenadu - Getmyuni
7. TS ECET Results 2024 OUT at ecet.tsche.ac.in; Know websites to check inside - Telegraph India
8. AP Inter 1st Year, 2nd Year Results 2024 Highlights: Girls outshine boys yet again! Check results at resultsbie.ap.gov.in - financialexpress.com
9. AP Assembly Elections Results: ఆంధ్రప్రదేశ్‍ ఎన్నికల ఫలితాల అప్‍డేట్స్ - Eenadu
Previous Post Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *